చంద్రబాబు కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు: ఏపీ డీజీపీ

చంద్రబాబు కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు: ఏపీ డీజీపీ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండటంతో   బారికేడ్స్‌తో జైలుకు వెళ్లే రోడ్లను బ్లాక్‌ చేశారు. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, . జైలులోనే  డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, Z ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీఐపీ కాబట్టి ఈ ఆదేశాలు అమలు చేయాలని  కలెక్టర్, వైద్యశాఖ అధికారులకు డీజీపీ కార్యాలయం సూచించినట్లు సమాచారం అందుతోంది.  జైలు పరిసరాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. అలాగే.. . డీఎస్పీ నేతృత్వంలో జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీజీపీ కార్యాలయం నుంచి  రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు ఆదేశాలువెళ్లినట్లు సమాచారం.

కాగా.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్నేహా బ్లాక్‌కు ఎదురుగా ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపారు,   ఇక సోమవారం ( సెప్టెంబర్ 11) ఉదయం 4 గంటలకు నిద్ర లేచిన బాబు.. కాసేపు యోగా చేశారు. అనంతరం ఆయనకు ఇంటి నుంచి వ్యక్తిగత సిబ్బంది అల్పాహారం, మెడిసిన్‌ తీసుకొచ్చారు. చంద్రబాబుకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఫ్రూట్‌ సలాడ్‌ను అందించారు. అల్పాహారంతో పాటు వేడి నీళ్లు, బ్లాక్‌ టీ కూడా ఇచ్చారు.